భూపాలపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని బుధవారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు. ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మోర్రే. సాయి కృష్ణ, రమేష్ చారి, పవన్, తదితరులు పాల్గొన్నారు.