మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా ఇండ్లను నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి . ఈరోజు బుధవారం భాస్కర్ గడ్డ వార్డు నెంబర్ 12 సర్వే నెంబర్ 363/1 అనే ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ మాట్లాడుతూ భూపాల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డు భాస్కర గడ్డ ప్రాంతంలో సర్వే నెంబర్ 363/1 అనే ప్రభుత్వ భూమిలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వం ఇచ్చిన ఎలాంటి అక్కు పత్రాలు లేకున్నా ,మున్సిపాలిటీ ఇంటి పర్మిషన్లు లేకున్నా, అక్రమంగా ఇండ్లను నిర్మించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే భాస్కర గడ్డ సర్వే నెంబరు 363/1 ప్రభుత్వ భూమి ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టి మున్సిపాలిటీ పర్మిషన్ లేని ఇండ్లను కూల్చివేసి వారిపై తగున చర్యలు తీసుకొని వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని తమరి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వారు, మట్టేవాడ సురేష్, అనూప్, అఖిల్, కార్తీక్, రాజు, తిలక్, నవీన్, అజయ్, వేణు, రిజ్వాన్, సాయిరాం తదితరులు పాల్గొనడం జరిగింది.