భూపాలపల్లి లోని స్థానిక కొమురయ్య భవన్ లో మంగళవారం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జులై 12న రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ బంద్ ను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల
విద్యార్థులు జయప్రదం చేయాలని కోరారు.