టేకుమట్ల మండలంలోని భూర్నపల్లి గ్రామంలో గల ఫౌల్ట్రీ యూనిట్ నుండి అధిక దుర్వాసన వస్తుంది. ఈ యొక్క దుర్వాసన వలన భూర్నపల్లి గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకి గురి అవుతున్నారు. ఈ యొక్క ఫౌల్ట్రీ యూనిట్ గ్రామానికి దగ్గరలో మెయిన్ రోడ్డుని ఆనుకుని ఉంది. ఈ దుర్వాసన భరించలేక ఈ యూనిట్ ఆవరణలో ఉన్న వ్యవసాయ రైతులకు పనులు చేయడానికి కూలీలు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీని వలన రైతన్నలు అధిక మొత్తంలో ఇబ్బందికి గురి అవుతున్నారు.