టీ ఎస్ పి ఎస్ సి లో జరిగిన క్వశ్చన్ పేపర్ లీకేజ్ లో కారకులైన వారందరినీ కూడా సిట్టింగ్ జడ్జి సమక్షంలో విచారించి వారిని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ మరియు అఖిలభారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు నేరెళ్ల జోసఫ్, వేముల శ్రీకాంత్ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుండి ఏ ఒక్క నోటిఫికేషన్ సక్రమంగా నిర్వహించిందే లేదన్నారు. ఎంతోమంది నిరుద్యోగులు వేలు వెచ్చించి కోచింగులు తీసుకుంటూ ఈసారైనా మాకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీ కారణంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి అన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోలపక్ష చూపిస్తున్న ఈ మొండి వైఖరిని మానుకోకపోతే రానున్న రోజుల్లో నిరుద్యోగులు అందరూ కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన శాస్త్రి చెబుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో జడల రాజేశ్వరి, హంగా మహేందర్, బొల్లపల్లి తిరుపతి, వనిత, లావణ్య, రమేష్ చారి తదితరులు పాల్గొన్నారు.