మీ ప్రాంత అభివృద్ధికి రైతులందరు సహకరించాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కోరారు. శుక్రవారం దుద్యాల మండలంలోని పోలెపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూసేకరణ నిమిత్తం రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు ముందుకు వచ్చి తమ భూములను అప్పగిస్తే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. ఎకరాకు రూ. 10లక్షలు, ఇంటి స్థలాలు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.