వికారాబాద్: పంట నష్ట పరిహారం.. అంతంతే
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 1385 మంది రైతులకు 1508.32 ఎకరాలకు రూ. 1,50,88,000 పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. భారీ వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగితే 1508 ఎకరాలకే పరిహారం అందించడం ఏమిటని పలువురు రైతులు బుధవారం ప్రశ్నిస్తున్నారు. పంట నష్టం అంచనాల తయారు సమయంలోనే ఎంత మేరకు తగ్గితే అంత కుదించాలనే మౌఖిక ఆదేశాల వల్లే ఇంత తక్కువ విస్తీర్ణంలో పంట నష్ట పరిహారం వచ్చిందనే విమర్శలున్నాయి.