కోస్గి: సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి
సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సిడిఎంఏ డైరెక్టర్ విపి గౌతమ్ అన్నారు. సోమవారం కోస్గి పట్టణంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి పర్యటించారు. ముసాయిపల్లి, బండం చెరువు అభివృద్ధి చేసేందుకు పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ. 416. 54 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.