బొంరాస్ పేట్: పులి కాదు.. హైనా పాద ముద్రలు
బొంరాస్ పేట్ మండల పరిధిలోని కొత్తూరు గ్రామ శివారులోని పొలాల్లో పులి వచ్చిందంటూ రైతులు భయాందోళనకు గురయ్యారు. వేరుశనగ పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు హైనాను చూసి భయపడి పులి కనిపించిందంటూ పరుగులు తీశారు. ఈ విషయం అటవీ అధికారులకు తెలపడంతో బీట్ ఆఫీసర్ ఆనంద్ రైతులతో కలిసి మంగళవారం అక్కడికి చేరుకొని పరిశీలించారు. పాద ముద్రలను గుర్తించి పులి కాదని, అది హైనా అని, ఎవరు భయాందోళన చెందొద్దని తెలిపారు.