వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రాగిజావ పంపిణీని సోమవారం నుంచి మళ్లీ ప్రారంభించినట్లు డీఈవో రేణుకాదేవి తెలిపారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,001 ఉండగా వాటిల్లో 72,277 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థికి 10 గ్రాముల చొప్పున వారంలో రెండు రోజులు బెల్లంతో తయారు చేసిన జావను అందించనున్నారు.