రంగారెడ్డి: ఐఏఎస్ అధికారిపై ఈడీకి ఫిర్యాదు
రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం గ్రామం, మధురానగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం హైదరాబాద్ బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రామ్మోహన్ గౌడ్, ఉపాధ్యక్షుడు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ దాదాపు 1000 కోట్లు విలువైన భూములను ఐఏఎస్ అమోయ్ కుమార్ మాయం చేశారని ఆరోపించారు. అధికారులు వెంటనే అమోయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.