పాత పింఛన్ పథకం, జాతీయ పింఛన్ పథకాలను సమ్మేళనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకొస్తున్న ఏకీకృత పింఛన్ పథకాన్ని ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. పదవీ విరమణకు చివరి 12 నెలల్లో పొందిన వేతనంలో కనీసం సగటుగా తీసుకుని వాటిలో 50 శాతం పింఛన్ గా అందిస్తారు. ఈ పథకం ద్వారా, అన్ని స్థాయిల వేతన జీవులకు న్యాయం జరుగుతుందని కేంద్రం పేర్కొంది.