టీవీఎస్ మోటార్ ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ను తీసుకురానుంది.‘భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025’’లో టీవీఎస్ తన ఫస్ట్ సీఎన్‌జీ స్కూటర్‌ను ఆవిష్కరించింది.ఈ స్కూటర్ ఫీచర్లను పరిశీలిస్తే.. ఇందులో 124.8-cc సింగిల్ సిలిండర్, అలాగే 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్, 1.4 కిలోల సామర్థ్యం గల సీఎన్‌జీ సిలిండర్ ఉంటాయి. దీని టాప్ స్పీడ్ గంటకు 80.5 కిలోమీటర్లుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.