తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో ప్రశాంత్ కిషోర్‌తో విజయ్ భేటీకానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఇరువురి మధ్య ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలో తమిళనాడు మొత్తం పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేసేందుకు విజయ్‌ని ప్రశాంత్ కిషోర్ సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ పార్టీలలో చర్చ జరుగుతోంది.