యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం సదర్ షాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలయ్య (62) అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. ఆస్తి తగాదాల వలన ఆయన దహన సంస్కారాలు కుమారులు ఆపారు. మృతునికి భార్య లింగమ్మ, కుమారులు నరేష్, సురేష్, కుమార్తెలు శోభ, సోని ఉన్నారు. ఆస్తులలో వాటా రావాలని అభ్యంతరం తెలపడంతో గత రెండు రోజులుగా శవాన్ని శవపేటికలో ఉంచారు. దహన సంస్కారాలు బంద్ చేయడంతో స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.