సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి చెన్నకేశవ స్వామి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు రఘువరన్ ఆచార్యులు ప్రత్యేక అలంకరణ చేశారు. కార్తీకమాసం కావటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ పురాతన ఆలయాలకు నిగూఢ క్షేత్రం అయిన పిల్లలమర్రిలో ఉత్తర ముఖ ద్వారం కలిగి లక్ష్మీ సమేతంగా కోలువు దీరిన చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రతి శుక్రవారం వైభవ పేతంగా పూజలు నిర్వహిస్తారు.