పెనుగొండ మండలం వడలి గ్రామానికి చెందిన కొండేపూడి రామకృష్ణ తెలుగు రాష్ట్రాల్లో పగలు సైకిల్ పై రిక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డిఎస్పీ రవి తెలిపారు. సూర్యాపేటలోని జనగామ క్రాస్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుండగా స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా విషయం బయట పడినట్లు శనివారం డిఎస్పీ రవి తెలిపారు. అతని వద్ద 117.3 గ్రాముల బంగారం, రూ 1.20 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.