సూర్యాపేటలో 44వ వార్డులో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ రాంబాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఈ కార్యక్రమం ద్వారా ఓటర్లు చిరునామా మార్పు, జాబితాలో ఇంటి పేరు, ఇతర సవరణలు, 1 జనవరి 2025 వరకు 18 సంవత్సరాలు నిండిన యువత కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వేణుమాధవ్, ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ కే శ్రీనివాస్ ఉన్నారు.