పెండింగ్ లో ఉన్న నాలుగు విడతల కరువు భత్యమును వెంటనే మంజూరు చేయాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సోమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ , రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జే. యాకయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసరెడ్డి ఉన్నారు.