హైడ్రా కూల్చివేతలపై పలువురు వ్యక్తులు చేసే ప్రకటనలు నమ్మవద్దు అని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రజలకు సూచించారు. అధికారులు కూడా హక్కు ఉన్న వాళ్ళ పట్ల తొందరపడి కూల్చవద్దు అని సూచించారు. హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సూచించారు. ప్రజలకు నష్టం చేయవలసిన ఆలోచన ప్రభుత్వానికి లేదు అని తెలియజేశారు.