ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, చివ్వెంల ఎస్ఐ వెంకట్ రెడ్డి, మండల పరిధిలోని చందుపట్లలో సైబర్ నేరాల, గంజాయి, డ్రగ్స్ మత్తుమందులపై, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాలపై, గంజాయి డ్రగ్స్ మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పని చేస్తున్నామని తెలిపారు.