నల్గొండ: లక్ష 66 వేల 485 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ఈ వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 27 వేల 936 మంది రైతుల నుండి 386 కోట్ల 24 లక్షల రూపాయల విలువ చేసే లక్ష 66 వేల 485 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం సేకరణలో భాగంగా జిల్లాలో 346 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.