రైతులు వానాకాలం వరి పంట కోతలు పూర్తికాగానే చాలా మంది రైతులు వరి కొయ్యలను కాల్చుతున్నారని ఈ విధానంతో నష్టం జరిగే అవకాశం ఉందని నడిగూడెం ఏవో దేవప్రసాద్ తెలిపారు. భూమిలో కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుందని ఈ బ్యాక్టీరియా ఎల్లపుడూ భూమిని సజీవంగా ఉంచుతుందన్నారు. వరి కొయ్యలను కాల్చితే వేడిమితో బ్యాక్టీరియా చనిపోయి భూమి నిర్జీవం అయ్యి కాలుష్యం వెలువడటంతో పంటలు పండవని అన్నారు.