హుజూర్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా ఎకనామిక్స్ ప్రొఫెసర్ సోమపొంగు రామారావు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ అధ్యాపకుల, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రామారావు ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టడం పట్ల కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, బంధువులు, మిత్రులు అభినందనలు తెలిపారు.