బీజేపీ పార్టీ హుజూర్ నగర్ విశ్వకర్మ సెల్ కన్వీనర్ గా గోధురి బ్రహ్మచారిని నియమిస్తూ బీజేపీ పార్టీ విశ్వకర్మ సెల్ జిల్లా కన్వీనర్ కట్టుకోజు నాగేంద్రచారి మంగళవారం ప్రకటించారు. ఈ సందర్బంగా సూర్యాపేట జిల్లా సభ్యత్వ నమోదు ప్రబారి మర్రి రాజశేఖర్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యరెడ్డి, కోదాడ నియోజకవర్గ కన్వీనర్ కనగాల నారాయణల సమక్షంలో నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాతులూరు హనుమంతరావు ఉన్నారు.