నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన ఉపాధ్యాయులకు పిఆర్టియు సంఘం అన్నివేళలా అండగా ఉంటుందని పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మాతంగి ప్రభాకర్, మన్నెం వెంకట్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలో డీఎస్సీ 2024 ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాలను ఉచితంగా అందజేసి మాట్లాడారు. ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బాధ్యులు ఉన్నారు.