హుజూర్నగర్ పట్టణంలోని 18 వ వార్డులో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిషాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్, ఎన్యుమరేటర్స్, సూపర్వైజర్స్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.