పుట్ట సైదులు మృతి బీసీ ఉద్యమానికి తీరని లోటని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు. హుజూర్ నగర్ మండలం కాచవారిగూడెం మాజీ సర్పంచి, బిసి ఉద్యమకారుడు పుట్టా సైదులు మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జడ శ్రీనివాస్ ఉన్నారు.