ప్రముఖ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 ఒడిశా షెడ్యూల్ షూటింగ్ పూర్తైంది. ఈ మేరకు గౌరవ ఆతిథ్యాన్ని అందించిన అక్కడి యంత్రాంగానికి స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరలవుతోంది. ఒడిశా షెడ్యూల్ పూర్తయిందని వెల్లడిస్తూ ఫొటోలు షేర్ చేశారు. ఆ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.