వేములవాడ పట్టణానికి చెందిన 27వ వార్డ్ కౌన్సిలర్ గోలి మహేష్ తండ్రి గోలి శంకరయ్య గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం అకాల మరణం పొందారు. విషయం తెలుసుకున్న వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు, మహేష్ ఇంటికి వెళ్లి శంకరయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ పెద్దను కోల్పోవడం చాలా బాధాకరమని, ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.