రుద్రంగి మండల కేంద్రానికి చెందిన చిట్టవరం భూమేశ్వర్ అనే వ్యక్తి గత నెల రోజుల క్రితం కువైట్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పరిస్థితి దయనీయంగా మారిందని తెలుసుకున్న రుద్రంగి మస్కట్ సేవ సమితి సభ్యులు సోమవారం ఆర్థిక సహాయం అందజేశారు. భూమేశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మస్కట్ సేవ సమితి సభ్యులు కోరారు. నిరుపేద కుటుంబానికి మరి కొంతమంది సహాయం చేయాలని కోరారు.