శాసనసభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వేములవాడ పట్టణ సీఐ పి కరుణాకర్ హెచ్చరించారు. ప్రశాంతంగా
ఎన్నికలు జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, ఫేస్ బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫాములలో ఏ రకమైన అభ్యంతరకరమైన పోస్టులు పెట్టినా తక్షణమే కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు.