వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నెమలివాహనంపై పట్టణ పురవీధుల గుండా దేవదేవుళ్ళు విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివార్ల దివ్య రూపాన్ని తిలకించారు.