బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహారావును గురువారం వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామనికి చెందిన ఎస్సి(మాల) సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో కుల సంఘం భవన నిర్మాణ పనులు నిధుల కొరతతో నిలిచిపోయిందని, భవన నిర్మాణం పూర్తి అయ్యేందుకు సహకరించాలని చల్మెడను కోరారు. భవన నిర్మాణానికి సహకరిస్తారని హామీ ఇచ్చారు