అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దులో 05 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి మద్యం, డబ్బు ఇతర అక్రమ రవాణా, అసాంఘిక కార్యకాలపాలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం సాయంత్రం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి చెక్ పోస్ట్ లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేశారు.