పోరాదేవీలోని బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీశ్రీసేవలాల్ మహారాజ్ బంజారా మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ప్రధానమంత్రి మోడీ సభను జయప్రదం చేయాలని లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ఇంఛార్జి బానోత్ నరేష్ నాయక్ కోరారు. బంజారా కాశీగా పిలువబడే పోరాదేవి ఆలయం నిర్మాణం కోసం 600 కోట్లను కేటాయించి వాటి నిర్మాణాన్ని పూర్తిచేసిన కేంద్ర ప్రభుత్వానికి బంజారాల తరపున శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.