వేములవాడ మున్నూరుకాపుల ఆధ్వర్యంలో శనివారం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తెలంగాణ చౌక్‌లో దహనం చేశారు. మున్నూరు కాపులు మాట్లాడుతూ మాజీ టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పై రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలను తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే లక్ష్మయ్యకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.