వేములవాడలో తుల ఉమా మీడియా ఆదివారం జరిగిన సమావేశంలో నేను ఏ పార్టీలోకి వెళ్ళేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. నన్ను నమ్ముకున్న వారు ఉన్నారని వారి నిర్ణయం మేరకే నా యొక్క కార్యచరణ ప్రకటిస్తానని అన్నారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలిపారు. నాపై తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియా ముఖంగా తెలిపారు.