కటింగ్ లేకుండా ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. సోమవారం పెద్దపల్లి మండలం రాంపెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతు సంక్షేమానికి పని చేస్తుందన్నారు. ఈకార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ రామిడి నర్సింహరెడ్డి, సంపత్ రావు, కనపర్తి ప్రభాకర్ రావు, తిరుపతిరావు పాల్గొన్నారు.