జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎఫ్సీఐ ద్వారా జరిగే వడ్ల కొనుగోలు సజావుగా జరిగే విధంగా దృష్టి సారించాలన్నారు.