జగిత్యాలకి సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్ పల్లి మెయిన్ రోడ్డుపైన ఉన్న 25 ఎకరాల భూమి సర్వే చేసి కాంటూరు మ్యాప్ తో ప్రతిపాదనలు పంపారని, 100 కోట్లతో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేసిన రేవంత్ రెడ్డికి శనివారం ధన్యవాదాలు తెలిపారు.