జిల్లా ప్రజా పరిషత్ కింద మంజూరైన అభివృద్ది పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెడ్పీ కింద మంజూరైన పనులపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓ లు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.