క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక చొరవతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఐడిఓసి కార్యాలయంలో శుక్రవారం ప్రోగ్రాం ఆఫీసర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య శాఖ పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఏ శ్రీనివాస్ పాల్గొన్నారు.