జమ్మికుంట పట్టణంలో కల్యాణ లక్ష్మి చెక్కులను బుధవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద బిడ్డల పెళ్లిల కోసం ఉన్నతంగా ఆలోచించి మహోత్తరమైన కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకువచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు, అధికారులు పాల్గొన్నారు.