విద్యతో సమాజ పురోగతి: బలగం కొమురయ్య

2076பார்த்தது
విద్యతో సమాజ పురోగతి: బలగం కొమురయ్య
విలువలతో కూడుకున్న విద్య నేటి సమాజ పురోగతికి ఊతమిస్తుందని బలగం సినిమా కొమురయ్య పాత్ర ధారి కేతిరి సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు విజయం సాధించాలంటే పోటీ తత్వం బాగా ఉన్న ఈ రోజుల్లో అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. చదువుపైనే శ్రద్ధ పెట్టాలని ఇతర అంశాలపై దృష్టి సారిస్తే భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించడానికి ముందుకు వచ్చిన వాగ్దేవి డిగ్రీ కళాశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న యాజమాన్యం తీరును ఆయన కొనియాడారు. అనంతరం కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ. కరోనా ముందు కాలేజీలో 1300 మంది చదువుకునే వారిని విపత్కర సమయం తర్వాత ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని కాలేజీకి పునర్ వైభవం తీసుకొని రావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటే పిల్లలకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా కాలేజీలో చదువుకొని, ఎన్సిసి తోపాటు వివిధ అంశాలలో బహుమతులు పొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సంస్కృతి అంశాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అమ్మాయిలు చేసిన శాస్త్రీయ నృత్యాలు ప్రశంసలు అందుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సలహాదారులు పి. శంతన్ రెడ్డి, కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వేణుమాధవ్, ఏ కె వి ఆర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్, ట్రస్మా మండల అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్, విజ్ఞాన్ స్కూల్ కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్, వి -బిలీవ్ మేనేజింగ్ డైరెక్టర్ గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி