టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం హుజరాబాద్ పట్టణంలో పర్యటించారు. ఎమ్మెల్సీ హోదాలో మొదటిసారి హుజురాబాద్ వచ్చిన కోదండరాంకు ఇక్కడి టీజేఎస్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మహిళలు, డప్పు, కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. అభిమానుల సందోహం నడుమ ఎమ్మెల్సీ కోదండరాం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నివాళులర్పించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.