ఎండపల్లి మండల కేంద్రంలోని యునాని వైద్యశాల శిథిలావస్థకు చేరుకొని కూలిపోయేంత ప్రమాదకరంగా మారింది. ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యాధికారి, ఔషధ నిపుణుడు, కార్యాలయ నిర్వాహకుడు లేకపోవడం వల్ల నెలలో మూడు రోజులు ఔషధ నిపుణుడు, మూడు రోజులు వైద్యాధికారి విధులు నిర్వహించుకుంటూ రోగులకు సేవలు అందిస్తున్నారు. శిథిలావస్థలో గల ఆసుపత్రి స్థానంలో నూతన భవనం నిర్మించి, సిబ్బందిని కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.