జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ఉన్న మహాత్మ జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్, జూనియర్ కళాశాలను కలెక్టర్ బి సత్య ప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను, పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారి వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసుధన్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సాయిబాబా, తహశీల్దార్ వరందన్ ఉన్నారు.