ధర్మారం మాజీ సర్పంచ్ దేవి పద్మ - జనార్ధన్ దంపతుల కుమారుడు దేవి అఖిల్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచారు. ధర్మారం గ్రామ పంచాయతీ కార్మికులను శనివారం శాలువాతో సన్మానించి, నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు దేవి జనార్ధన్, కాడే సూర్యనారాయణ, పాలకుర్తి రాజేశం గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.