రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని కొడిమ్యాల మండలంలోని వ్యవసాయశాఖ అధికారిణి పి. జ్యోతి సూచించారు. ఈ మేరకు వారు మంగళవారం మీడియాతో మాట్లాడారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టడం ద్వారా భూసారం తగ్గుతుందని తెలుపారు. దిగుబడి తగ్గుతుందని రైతులు గమనించాలన్నారు. కొయ్యలను పొలంలోనే కలియ దున్నితేనే పంటకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.